సంక్రాంతి రేసు నుంచి సూపర్ స్టార్ సినిమా అవుట్.. కారణం అదేనా..!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. ఆ సీజన్ లో భారీ సంఖ్యలో అగ్ర హీరోలు నటించిన సినిమాలు ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. అయితే ఒకరిద్దరు మినహా అగ్రహీరోలు ఎక్కువగా తలపడిన సందర్భాలు చాలా తక్కువ. ఓ రెండు పెద్ద సినిమాలు..ఓ రెండు చిన్న సినిమాలు లెక్కన థియేటర్లలో విడుదల అవుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం అందరూ అగ్రహీరోలే సంక్రాంతి బరిలోకి దిగారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట, ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ రాధేశ్యామ్, వెంకటేష్,వరుణ్ తేజ్ ల ఎఫ్-3 సినిమాలు విడుదల అవుతున్నాయి ఇందుకు సంబంధించి నిర్మాతలు డేట్లు కూడా ప్రకటించారు.

అయితే ఈ సినిమాలకు మధ్యలో మేము కూడా ఉన్నాం.. అంటూ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కానుంది. అయితే ఇంత మంది అగ్ర హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డ సంఘటన ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. అయితే సినీ విశ్లేషకులు మాత్రం ఇన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం లేదని కొన్ని తప్పుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. వీటి విడుదలకు అడ్డంకిగా ఏదీ లేదు. భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అందుకు సంబంధించి ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ సాంగ్ కూడా విడుదలైంది. ఈ సినిమా విడుదల కావడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.అయితే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఇంకా చాలా భాగం షూటింగ్ జరగాల్సి ఉంది.

తాజా అప్డేట్ ప్రకారం ఇందులో ఒక సీన్లో మహేష్ నరసింహస్వామి గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సింహాచలం టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ కూడా వేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతుండగా.. ఆ తర్వాత ఆలయ సెట్ లో జరుగుతుంది.

ఇంకా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పెండింగ్ లో ఉంది. దీన్ని బట్టి ఈ సినిమా సంక్రాంతి రేస్ లో నిలవడం కష్టమేనని అంటున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదల అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. వెంకీ,వరుణ్ ఎఫ్ 3 సినిమాకు సంబంధించి కూడా ఇంకా ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా కూడా సంక్రాంతి విడుదల అవుతుందా.. లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి.