ఆ చిన్న తప్పు వల్లే.. పునీత్ ప్రాణం తీసిందా..!

October 30, 2021 at 6:52 am

పునీత్ రాజ్ కుమార్ మరణవార్త కన్నడ సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా శోకసముద్రంలో కి వెళ్ళిపోయింది. పునీత్ రాజ్ 46 సంవత్సరాలకే మరణించాడనే వార్త ఆయన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం నాడు ఉదయం లేవగానే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దాంతో పునీత్ ను వెంటనే బెంగుళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. దాంతో ఆయనను ఐసీయూలో పెట్టారు. చికిత్స జరుగుతున్న మధ్యలో పునీత్ మరణించడం జరిగింది. ఇదిలా ఉండగా పునీత్ మరణానికి ప్రధాన కారణం అతని పొరపాట్లే అని వైద్యులు తెలియజేస్తున్నారు.

ఫిట్నెస్పైనే ఎక్కువ మక్కువ ఉండడంతో.. జిమ్ వర్కవుట్లు చేయడంవల్ల ఆయనకు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. జిమ్ వర్కౌట్ చేయకపోతే ఆయనకు ఆ రోజంత ఏదోలా ఉంటుంది అని కూడా తెలిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే డాక్టర్లు తెలిపిన మేరకు 40 సంవత్సరాలు వయసు దాటిన వారు కేవలం ఒక గంట వాకింగ్, రన్నింగ్ చేస్తే చాలు.. కానీ ఇలా చేయడం వల్ల పునీత్ మరణించాడని వైద్యులు తెలుపుతున్నారు.

ఆ చిన్న తప్పు వల్లే.. పునీత్ ప్రాణం తీసిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts