ఏపీలో ఊహించ‌ని రీతిలో ప‌డిన క‌రోనా కేసులు..కార‌ణం ఏంటంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది.

గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేల‌కు లోపుగా న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మాత్రం ఊహించ‌ని రీతిలో ప‌డిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 122 కేసులు న‌మోదు కాగా.. అతి స్వ‌ల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు న‌మోదు అయింది.

దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 20,47,459 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 6 మంది మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,142 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 1,178 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,20,835 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 12,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 38,069 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు. అయితే క‌రోనా టెస్ట్‌లు త‌క్కువ చేయ‌డం వ‌ల్ల కేసులూ త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి.