నటుడు శుభలేఖ సుధాకర్ తల్లి కన్నుమూత!

తెలుగు సినీ ప్రేక్షకులకు శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. అయితే శుభలేఖ అన్న పదం ఆయన ఇంటిపేరు కాదు.ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా అయినా సుపరిచితం. ఈ సినిమా తరువాత ఆయన ను శుభలేఖ సుధాకర్ గా పిలిచేవారు. ఇది ఇలా ఉంటే తాజాగా శుభలేఖ సుధాకర్ తల్లి, గాయని ఎస్.పి.శైలజ అత్త అయినా ఎస్ ఎస్ కాంతం మంగళవారం చెన్నై లో కన్ను మూశారు. సుధాకర్ తల్లి ఎస్ ఎస్ కాంతం, తండ్రి సూరా వజ్జల కృష్ణారావు చెన్నై మహాలింగాపురం లోని సుధాకర్ నివాసంలో ఉండేవారు.

అయితే రెండేళ్ల క్రితం శుభాకర్ తండ్రి కృష్ణారావు మరణించారు. ఆ తర్వాత తల్లి కాంతం 3 నెలల క్రితం గుండెపోటుకు గురయ్యే ఉంది. దీనితో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో, అనారోగ్య కారణాలతో ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. కృష్ణారావు కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా వారిలో సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళి దత్తుపోయి వైజాగ్ లో, మూడో కొడుకు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు. ఇక సుధాకర్ తల్లి కాంతం అంత్యక్రియలు నేడు చెన్నైలో మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా ఏఐటిఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సి ఎం కె రెడ్డి ఎస్ ఎస్ కాంతం భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించారు.