ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా టైటిల్ ఇదే..?

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే నవంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తున్నది ఈ సినిమాకి ఒక టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం.

 

ఆ టైటిల్ ఏమిటంటే డైమండ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వినిపిస్తోంది.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని చూస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ.ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తుండటం విశేషం.ఇక ఈ సినిమా కూడా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఉండడంచేత ఈ సినిమాకి డైమండ్ ని టైటిల్ ను ఫిక్స్ చేశారు అన్నట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

త్వరలో ఎన్టీఆర్ 30వ సినిమా కు సంబంధించి అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ఇ సినిమాలో కూడా హీరోయిన్ కియారా అద్వానీ నటించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు అనిరుద్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.