రేలంగి వెంకట్రామయ్యకు.. రేలంగి నరసింహారావుకు ఉన్న బంధం ఏమిటి..?

రేలంగి నరసింహారావు.. తన ఇంటిపేరు రేలంగి అవడం చేత ఆయనకు దూరపు బంధువులు చాలా మంది అలా పిలుస్తుంటారు.. అంతేకాకుండా వాళ్ళ నాన్నకు కూడా చాలామంది బంధువులు వున్నారు. ఇక సినిమాలలో కూడా కామెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రేలంగి వెంకట్రామయ్య మీకు బంధువా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకు ఆయన ఈ విధంగా సమాధానం తెలిపాడు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..రేలంగి వెంకట్రామయ్య ,బి ఎల్ వి ప్రసాద్ గారు, కె.ఎస్.ఆర్.దాస్ గారు అందరూ ఒకే దగ్గర పని చేసేవారు.. ఆ తర్వాత అమ్మ గురువుగారైనటువంటి దాసరి నారాయణ దగ్గర ఎక్కువ సినిమాలు చేశారట. ఇక ఒక సారి షూటింగ్ సమయంలో నేను ఒక సోఫా సీట్ లో కూర్చుని ఉన్నప్పుడు.. నీ పేరు ఏంటయా అని అడగరు రేలంగి నరసింహారావు అని తెలిపాను. అప్పుడు ఒక ఆయన నీ పేరు రేలంగి వద్దు ఇక నుంచి నువ్వు ఉత్తా నరసింహా రావు అని తెలియజేశారు.. అదేంటి అని అడగగా రేలంగి మా ఇంటిపేరు అందుకనే దానిని నువ్వు తొలగించుకోవాలి అని తెలియజేశాడు అప్పుడు తెలిసింది ఆయన రేలంగి వెంకటరామయ్య. అని..

రేలంగి నరసింహారావు రాజేంద్రప్రసాద్ తో 32 సినిమాలు, చంద్రమోహన్ తో 24 సినిమాలు చేశారు. సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులతో కలిసి నటించాలని తెలియజేశాడు. ఇదంతా ఆలీ షో ద్వారా తెలియజేశాడు రేలంగి నరసింహారావు. ఇక తన తండ్రి గురించి చెప్పుకుంటూ తన తండ్రి కూడా తనను డాక్టర్ చేయాలనుకున్నాడు. కానీ పియుసి లో 86 శాతం మార్కులు వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు రాకపోవడంతో నిరుత్సాహ చెందాడు నరసింహారావు. దాంతో ఆయన చదువును పక్కన పడదాం అనుకున్నాడు. కాని తన తండ్రి కోసం ఆయన కేవలం డిగ్రీ పూర్తి చేశాడు.

తనకు చిన్నప్పటి నుంచి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను ఎవరో కాదు కోడిరామకృష్ణ.. మేమిద్దరం మంచి స్నేహితులం అని , చదువుకునేటప్పుడు నుంచి కలిసే ఉండేవాళ్ళమని తెలియజేశారు. అంతేకాకుండా కోడి రామకృష్ణ యూత్ కాంగ్రెస్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో కూడా ఉండేవారని తెలియజేశాడు.

మొట్టమొదటిసారిగా 1985 వ సంవత్సరంలో చందమామ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మురళి మోహన్,మోహన్ బాబు నటించారట. అంతేకాకుండా తనకు సంబంధించిన విషయాలను ఆ షో లో తెలియజేయడం జరిగింది.