నటి హిమజా ఇంట్లో అద్భుతం.. సాయిబాబా విగ్రహం నుండి అలా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అంతేకాకుండా ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇది ఇలా ఉంటే నటి హిమజా తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా ఒక వీడియో ని షేర్ చేసింది. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004లో ఆమె కుటుంబానికి రమణానంద మహర్షి అనే ఒక స్వామీజీ పరిచయమయ్యాడు అని, ఇంట్లో అందరూ సాయిబాబా భక్తులు కావడంతో 19 రోజుల పాటు హోమం చేస్తామని తెలిపింది. అయితే ఒకరోజు తాను సాయిబాబా విగ్రహం సుబ్రపరుస్తున్న సమయంలో ఆ విగ్రహం నుంచి ఆ విభూతి వస్తోందట. అప్పుడు హిమజా వెంటనే అక్కడున్న వారందరినీ పిలిచి చూపించేసరికి చుట్టూ ఉన్న గోడ నుంచి విభూతి ఊరుతుందనే విషయం తనకు అర్థమైందని తెలిపింది. అలాగే విగ్రహం క్లీన్ చేయడానికి ఉంచిన నీళ్లు మొత్తం తులసి నీరుగా మారాయి అంటూ ఆమె తెలిపింది. ఈ విషయాలను మిమ్మల్ని నమ్మించడానికి కాదు అంటూ ఆమె తెలిపింది.

Share post:

Latest