నాగార్జున పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. 60 ఏళ్ల వయసులో ఎలా బతకాలో?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన ఇద్దరు కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు నాగార్జునకు విష్ చేస్తూ తనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కొన్నేళ్ళ క్రితం బండ్ల గణేష్ నాగార్జునకు ఒక సూచన చేశారట. షాద్ నగర్ లో భూములు చౌకగా ఉన్నాయి భవిష్యత్తులో మంచి ధర పలికే అవకాశం ఉంది, కాబట్టి అక్కడ పొలాలు కొనమని సలహా ఇచ్చారట. అందుకు స్పందించిన నాగార్జున ఆ పొలాలు కొన్నా అందులో వ్యవసాయం చేసే నాటికి నా వయసు 60 ఏళ్లు దాటి పోతుంది అని అన్నారట. నాగార్జున గొప్ప ప్రణాళిక గల వ్యక్తి ఆయన 40 ఏళ్ల వయసులో ఎలా జీవించాలో, 50 ఏళ్ల వయసులో ఎలా జీవించాలో 60 ఏళ్ల వయసులో ఎలా జీవించాలో ముందుగానే ప్లాన్ వేసుకున్నారని బండ్లగణేష్ అన్నారు. ఇక బండ్ల గణేష్ మాటలను బట్టి చూస్తే నాగార్జున తన లైఫ్ పట్ల ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో అని అర్థమవుతుంది.