ప్రభాస్ బాటలో రౌడీ హీరో .. కారణం ..?

విజయ్ దేవరకొండ.. మొదట సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకులకే షరతు పెట్టే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే ఆయన ఇటీవల అన్ని యూత్ కు దగ్గరయ్యే లవ్ రొమాంటిక్ చిత్రాలలో చాలా గాఢంగా నటించడంతో, ఇక యువత ఫాలోయింగ్ చాలా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైనా కథ ఉంది వింటావా.. అని అడిగితే..? అప్పుడు విజయ్ దేవరకొండ నుంచి వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే ..మీరు చెప్పబోయే కథ ఇన్ ఇండియా కథ నా లేక..? అని అడుగుతాడట. ఇటీవలకాలంలో మొత్తానికి పాన్ ఇండియా కథలని వింటున్నాడని తెలుస్తోంది.

అంతేకాదు దర్శకుల మధ్య జరుగుతున్న చర్చ ఏమిటంటే , విజయ్ దేవరకొండ కు కథ వినిపిస్తే అది పాన్ ఇండియా మూవీ అయి ఉండాలని లేకపోతే అతని వినడం లేదు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్ లాగే ఇక ఈయన కూడా ఇకనుంచి అన్ని ఇండియా సినిమాలని వింటానని షరతు పెట్టాడట. మన భాష కే పరిమితమైన కొన్ని చిన్న చిన్న సినిమా కథలు అయితే అస్సలు పట్టించుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్టు కాస్త ఇప్పుడు సందిగ్ధంలో పడింది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో శివ తీర్చిదిద్దే లేడన్న కారణంతోనే ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా విడుదలైతే ఇతర భాషల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో అర్థమవుతుంది అంటున్నారు దర్శకులు..