ఇండియన్ సైంటిస్టుల‌పై పీఎం ప్రశంసలు..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విజృంభ‌న ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి అంతానికి కేవ‌లం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్‌ను డెవ‌ల‌ప్ చేసి మార్గ‌ద‌ర్శకంగా నిలిచారు ఇండియ‌న్ శాస్త్ర‌వేత్తలు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వారిని అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్ర‌వేత్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో కలిపి కృషి చేయ‌డం వ‌ల్ల అనేక అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని మోడీ వెల్ల‌డించారు. విదేశీ, స్వదేశీ శాస్త్రవేత్తలు ఒకే వేగంతో పని చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. అలాగే ఇండియాను వ్యవసాయ రంగం నుంచి ఖగోళం వరకు, విపత్తు నిర్వహణ నుంచి డిఫెన్స్ టెక్నాలజీ వరకు, అలాగే ఇప్పుడు క‌రోనా ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ల నుంచి వర్చువల్ రియాలిటీ వరకు బయో టెక్నాలజీలో డెవ‌ల‌ప్ చేయ‌డానికి దోహ‌ద‌ప‌డాల‌ని కోరారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.