పవన్‌, పూరీ కాంబో సెట్టవుతుందా..?

June 11, 2021 at 6:05 pm

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ‌ద్రి సినిమాతో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ సినిమాతో ప‌వ‌న్ రేంజ్ మారిపోయింది. ఆ త‌ర్వాత కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు పూరి. అయితే ఆ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య సినిమా రాలేదు. హ్యాట్రిక్‌ సినిమా రావాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ స‌రికొత్త క‌థ‌తో ప‌వ‌న్‌, పూరి కాంబినేష‌న్‌లో ఓ స్టోరీ రానుందంటూ ఎప్ప‌టి నంఉచో ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా వీరి ప్రాజెక్ట్ పైన మ‌రోసారి చర్చ తెరమీద‌కి వచ్చింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వరుస సినిమాల‌తో పాటు రాజకీయాలతో బిజీగా మారాడు. ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల్లో కూడా సామాజిక చైతన్యంతో పాటు వైవిధ్యం ఉండే విధంగా చూస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఓ పవర్‌ఫుల్ మూవీనిఇ తెరకెక్కించేందుకు డైరెక్ట‌ర్ పూరీ ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. మహేశ్‌బాబు కోసం రెడీ చేసుకున్న జనగణమన స్టోరీని ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్‌తో తీయాలని పూరి చూస్తున్నారంట‌. మ‌రి ప‌ట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.

పవన్‌, పూరీ కాంబో సెట్టవుతుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts