క‌రోనా థర్డ్‌వేవ్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న‌ సోనూసూద్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ఆస్పత్రులే కాదు.. శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. మ‌రోవైపు ఆక్సీజన్ కొర‌త చాలా తీవ్రంగా ఉంది. ఇక సెకెండ్ వేవే ఇలా ఉందంటే.. రాబోయే థర్డ్‌వేవ్‌ ఎలా ఉంటోందో ఊహించుకోవాలంటేనే దడ పుడుతుంది.

అయితే థర్డ్ వేవ్ అంటూ వస్తే.. ఎదుర్కొవడానికి ప్రభుత్వాలు ఏమో గానీ.. రియ‌ల్ హీరో సోనూసూద్ ఇప్ప‌టి నుంచే ప్రణాళికలు ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా..సోనూ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. థ‌ర్డ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొర‌త మరింతగా ఉండే అవకాశం ఉందని ప‌సిగ‌ట్టిన సోనూ.. ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించాడు.

కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయ‌నున్నాడీయ‌న‌. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కు ఆర్డర్‌ చేశామని, మరో ప‌ది రోజుల్లో అక్కడి నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ రాబోతున్నట్లు సోనూసూద్‌ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్ల‌డించారు. ఇక సోనూ తీసుకున్న నిర్ణ‌యంపై దేశ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.