‘ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… టాక్ ఎలా ఉందంటే

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ హైప‌ర్ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. రామ్ – తిరుమ‌ల కిషోర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వచ్చిన నేను శైల‌జ సినిమా మంచి హిట్ అవ్వ‌డంతో పాటు రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మ‌రోసారి అదే కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఓవ‌ర్సీస్ టాక్ ప్ర‌కారం ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చేసిందో ? లేదో ? చూద్దాం.

సినిమా ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా చాలా డిఫ‌రెంట్ కాన్సెఫ్ట్‌తో క‌థ‌నం ఉంటుంది. ప్రేక్ష‌కుడికి క‌థ‌నం ప్రెష్‌గా ఉన్న ఫీలింగ్ ఫ‌స్టాఫ్‌లో క‌లుగుతుంది. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే మూడు పాట‌లు, చాలా సీన్ల‌లో షూట్ చేసిన లొకేష‌న్లు, ఫ్రెష్ ట్రీట్‌మెంట్ ప్ల‌స్‌లు. ఇక ద‌ర్శ‌కుడు ఫ‌స్టాఫ్‌లో అటు ప్రేమ‌క‌థ‌తో పాటు ఫ్రెండ్‌షిఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ క‌థ‌నం న‌డిపించాడు. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లతో కూడిన ట్విస్ట్ బాగుంది. ఫ‌స్టాఫ్ మొత్తం డీసెంట్‌గానే ఉంది.

ఫ‌స్టాఫ్ చూసిన వాళ్ల‌కు సెకండాఫ్‌పై ఇంకా అంచ‌నాలు పెరుగుతాయి. ద‌ర్శ‌కుడు ఏదో ల‌వ్‌+ఎమోష‌న‌ల్‌గా ఏదో మ్యాజిక్ చేస్తాడ‌న్న ఆశ‌తో ఉంటారు. అయితే సెకండాఫ్‌లో మాత్రం క‌థ బాగా స్లో అవుతుంది. రామ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెర్పామెన్స్ సూప‌ర్బ్‌గా ఉంది. ఇక ద‌ర్శ‌కుడి ప్రెష్ ట్రీట్‌మెంట్‌, దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్‌, ఎమోష‌న‌ల్ సీన్లు సినిమాను నిల‌బెట్టాయి. ఇక ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ట్విస్టులు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు ఫ్రెండ్ షిఫ్‌, ప్రేమ‌క‌థ‌ను ఎమోష‌న‌ల్‌గా మిక్స్ చేసిన తీరు బాగుంది. అయితే నెమ్మ‌దించిన సెకండాఫ్‌, క్లాస్ మూవీ కావ‌డంతో సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో ? చూడాలి.