వైసీపీ వాస‌న‌లు పోగొట్టుకోని టీడీపీ ఎంపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్యే తీవ్ర పోటీ జ‌రిగిందనే విష‌యం తెలిసిందే! కానీ ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున క‌ర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించార‌నే అంశం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న కూతురికి ఆ టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న సీఎంను కోర‌డం.. ఆయ‌న స‌సేమిరా అన‌డం ఇవ‌న్నీ జ‌రిగిపోయాయ‌ట‌. గత ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కూ సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌.. ఒక్క‌సారిగా టీడీపీపై త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు. కీల‌క‌మైన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు టీడీపీ నాయ‌కుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది!

క‌ర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీ అధినేత‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక పోరు తీవ్ర రస‌వ‌త్త‌రంగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అంతేగాక ఉప ఎన్నిక మొద‌లైన నాటి నుంచి ఆయన ప్ర‌చారంలో ఎక్క‌డా క‌నిపించక‌పోవ‌డం కూడా ప‌లు సందేహాలు తావిస్తోం ది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచారు. కొద్ది కాలంలోనే ఆయ‌న టీడీపీ కండువా క‌ప్పేసుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీరుపై నేత‌లు అనుమానంగానే ఉన్నారు. ఇప్పుడు తాజా వ్యాఖ్య‌ల‌తో.. ఆయ‌న‌ ఇంకా టీడీపీలోకి రాలేదేమోన‌నే అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు.

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో తాను ఎటువైపు అనే విషయంలో చంద్రబాబు అండ్ కోను సంశయంలో పడేశారు. చంద్రబాబుపై తాను అసంతృప్తిగా ఉన్నానని చెప్పడంతో పాటు… తప్పనిసరి పరిస్థితుల్లో భూమా ఫ్యామిలీకి మద్దతిస్తున్నాని ఆయన చెప్పడంతో ఎస్పీవై రెడ్డి టీడీపీ అభ్యర్థికి సపోర్టు చేస్తున్నారా లేదా అన్న విషయం ఆ పార్టీలో మొదలైందట. నంద్యాల ఉపఎన్నికలో సైకిల్ దూసుకుపోతుందని ఆయన చెప్పినప్పటికీ ఆ తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. నంద్యాల ఉపఎన్నికలో గెలిచేవారే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో తన కూతురికి సీటివ్వాలని కోరినా చంద్రబాబు వినలేదని… అందుకే ఆయనపై అలిగానని ఆయన చెప్పారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి మద్దతు ఇచ్చానని ఆయన వెల్లడించారు. దీంతో ఎస్పీవై రెడ్డిపై టీడీపీలో అనుమానాలు మొదలయ్యాయట. ఆయన పార్టీ విజయానికి ప్రయత్నం చేసే సూచనలు లేవని టీడీపీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. మ‌రి ఎస్పీవై రెడ్డి వ్య‌వ‌హారం టీడీపీకి మైనస్‌గా మారే అవ‌కాశాలు లేక‌పోలేదని వీరంతా భావిస్తున్నార‌ట‌.