జ‌య ప‌రిచ‌యం కాక‌ముందు శ‌శిక‌ళ బిజినెస్ ఏంటో తెలుసా

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శికళ జీవన పయనం ఓ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. ఎక్క‌డో ఓ సామాన్య వ్య‌క్తురాలిగా మిగిలిపోవాల్సిన శ‌శిక‌ళ ఈ రోజు అన్నాడీఎంకే ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో పాటు త‌మిళ‌నాడు సీఎం పీఠంపై క‌న్నేసి ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది.

శ‌శిక‌ళకు జ‌య ప‌రిచ‌యం కాక‌ముందు ఆమె లైఫ్ హిస్ట‌రీ చూస్తే ఆమె ఓ వీడియో క్యాసెట్ల షాప్ న‌డుపుకునేవారు. నాడు ఆమె వీఐపీల ఇళ్ల చుట్టూతిరిగి.. వీడియో క్యాసెట్లు అద్దెకు ఇచ్చేవారు. శ‌శిక‌ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. త‌మిళ‌నాడులోని రామ‌నాథ‌పురంలో చంద్ర‌శేఖ‌ర‌న్ పిళ్లై అనే వ్య‌క్తి నాటుమందులు ఇచ్చి కుటుంబాన్ని పోషించుకునేవారు.

కుటుంబ పోష‌ణ గ‌డ‌వ‌క‌పోవ‌డంతో ఆయ‌న తంజావూరు వ‌చ్చారు. ఆయ‌న కుమారుడు వివేకానంద‌న్ తంజావూరులో ఓ ఇంగ్లీషు మందుల దుకాణం పెట్టుకుని దానిని ర‌న్ చేస్తుండేవారు. ఆయ‌న కుమార్తె శ‌శిక‌ళ‌. శ‌శిక‌ళ డీఎంకే తంజావూరు శాఖ నాయ‌కుడిగా ఉన్న న‌ట‌రాజ‌న్‌ను 1970లో పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత ఆమె అన్నాసాలైంలో వినోద్ వీడియో విజ‌న పేరుతో ఓ షాపు ర‌న్ చేసింది.

1980 – 85 టైంలో శ‌శిక‌ళ వీడియో షాపు నిర్వ‌హించే వారు. అన్నాడీఎంకేలో జ‌య అప్పుడ‌ప్పుడే నిలదొక్కుకుంటున్నారు. ఆ టైంలో జ‌య‌కు క‌డ‌లూరు క‌లెక్ట‌ర్ చంద్ర‌లేఖ‌తో మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు పీఆర్‌వోగా పనిచేస్తున్న శ‌శిక‌ళ భ‌ర్త నటరాజన్‌కు చంద్రలేఖతో పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే చంద్ర‌లేఖ ద్వారా జ‌య‌కు శ‌శిక‌ళ ద‌గ్గ‌రైంది. అలా 1989లో శ‌శి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో పాటు త‌మిళ సీఎం పీఠం ఛాన్స్ కోసి వెయిట్ చేసే స్థాయికి వ‌చ్చేసింది.