బీబీసీ.. న్యూస్ ఇక‌, తెలుగులోనూ!

బ్రిట‌న్‌కి చెందిన బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) ప్ర‌సారాల‌కు ఉన్న క్రెడిబిలిటీ అంతా ఇంతా కాదు. ఏదైనా వార్త‌లు, లేదా స‌మాచారం నిర్ధార‌ణ కోసం ఇప్ప‌టికీ బీబీసీ ఛానెల్ చూసే వారు కొన్ని కోట్ల మందే ఉన్నారు. వేగం, వాస్త‌వం, వార్త‌ల్లో ప‌టుత్వం అనే మూడు ల‌క్ష‌ణాలే పెట్టుబ‌డిగా బీబీసీ పెద్ద ఎత్తున విస్త‌రిస్తోంది. గ‌త కొన్నాళ్లుగా ఈ సంస్థ‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ముఖ్యంగా 2022 నాటికి దాదాపు 50 కోట్ల మంది వీక్ష‌కుల‌కి ఈ ఛానెల్ ప్ర‌సారాల‌ను చేరువ చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో తెలుగు లోగిళ్ల‌లోనూ బీబీసీ వార్త‌లు విన‌బ‌డే అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది.

ఈ నేప‌థ్యంలో భార‌త్ వంటి అది పెద్ద దేశాలైతే వ్యాపార ప‌రంగా రేటింగ్ ప‌రంగాను బాగుంటుంద‌ని భావించిన బీబీసీ.. ముఖ్య భార‌తీయ భాష‌ల్లోనూ బీబీసీని ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో తెలుగు, పంజాబీ, మ‌రాఠీ భాష‌ల్లో ప్ర‌సారాలు ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృతం అయితే, 2017 అంటే మ‌రో ఆరేడు నెల‌ల్లోనే దేశంలోని ముఖ్య ప్రాంతీయ భాష‌ల్లో బీబీసీ ప్ర‌సారాలు మొద‌ల‌వుతాయి. ఇప్ప‌టికే నేష‌న‌ల్ జియోగ్ర‌ఫిక్ వంటి ఛానెళ్లు.. త‌మ ప్ర‌సారాల‌ను ప్రాంతీయ భాష‌ల స్థాయిలో అందిస్తున్నాయి.

కాగా, లండ‌న్ కేంద్రంగా ప‌నిచేసే బీబీసీ.. భార‌త్‌లోనూ వేళ్లూను కుంటే ఛానెళ్ల మ‌ధ్య మ‌రింత పోటీ త‌త్వం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక‌, నిబంధ‌న‌ల మేర‌కు స్థానిక జ‌ర్న‌లిస్టుల‌కు ఉద్యోగాలు ల‌భించే అవ‌కాశమూ ఉండ‌నుంది.మొత్తం గా 1300 మంది కొత్త ఉద్యోగుల‌కు ఛాన్స్ ల‌భించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. స్థానిక ఛానెల్స్‌కు ధీటుగా వివిధ భాషల ప్రసారాలు ఉంటాయని..అందుకు తగ్గ ఏర్పాట్లు చేయబోతున్నామని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. 1932లో ఆంగ్లభాషలో ప్రారంభమైన బీబీసీ ప్రపంచ వ్యాప్తంగా 29 భాషల్లో ప్రసారాలు చేస్తోంది.