” బిగ్ బ‌జార్‌ “ను బాబు సేవ్ చేశారా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌నాలు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బందులు ప‌డేవారు పెరిగిపోయారు. పెద్ద నోట్లు ఉండి కూడా ఏం చేయాలో తెలియ‌క తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే, ఈ పెద్ద నోట్ల ర‌ద్దును కూడా కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నోట్ల ర‌ద్దు విష‌యం బాబుకు నెల రోజుల ముందే తెలిసిపోయింద‌ని విప‌క్షాలు అంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌న ద‌గ్గ‌ర ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక‌, త‌న హెరిటేజ్ సంస్థ‌ను కూడా బిగ్ బ‌జార్ మాతృసంస్థ ఫ్యూచ‌ర్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నార‌ని, నల్ల‌ధ‌నాన్ని పెద్ద ఎత్తున వైట్ చేసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న ప‌లుకుబ‌డి, అధికారాన్ని వినియోగించి బిగ్ బ‌జార్‌.. బిగ్ బ‌జార్ బ్యాంక్‌గా కూడా బాబు మార్చేశార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశంలో ఏ సంస్థ‌కూ ఇవ్వ‌నటువంటి ల‌క్కీ ఛాన్స్‌ని ప్ర‌భుత్వం బిగ్ బ‌జార్‌కి ఇచ్చింది.

ఈ నెల 25(శుక్ర‌వారం) నుంచి బిగ్ బ‌జార్‌లో రూ.2000 నోట్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. అంటే క‌స్ట‌మ‌ర్లు నేరుగా బ్యాంకుకు వెళ్ల‌కుండా బిగ్ బ‌జార్‌కి వెళ్లి త‌మ డెబిట్ కార్డుల ద్వారా రూ.2000 నోట్ల‌ను తీసుకోవ‌చ్చు. ఈ స‌దుపాయం పైకి బాగానే ఉన్నా.. లోప‌ల మాత్రం పెద్ద ఎత్తున కుంభ‌కోణం దాగి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.  దేశవ్యాప్తంగా 115 పట్టణాలు – నగరాల్లోని 258 బిగ్ బ‌జార్ స్టోర్ లలో ఈ సదుపాయం అందుబాటులోకి వ‌చ్చింది. ఎస్ బీఐ తమ పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్ల ద్వారా విత్ డ్రాయల్స్ కు సహకరించ‌నుంది.

అయితే, ఇప్పుడు ఇలా బిగ్ బ‌జార్‌కే ఈ ఛాన్స్ ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. . దేశంలో అనేక ప్రైవేట్ రిటైలర్లు ఉండగా బిగ్ బజార్ కే ఎస్‌బీఐ ఈ అవకాశం ఎందుకిచ్చిందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బజార్ కు రోజుకు 25కోట్లను ఎస్ బీఐ తరలిస్తే ఆ సొమ్మును చంద్రబాబు అండ్ బ్యాచ్ తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు ఉపయోగిస్తారన్న అనుమానం క‌లుగుతోంద‌ని విప‌క్షాలు విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విమ‌ర్శ‌ల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, ఇప్ప‌టికిప్పుడు మాత్రం చంద్ర‌బాబు.. బిగ్ బ‌జార్‌ను పూర్తిస్థాయిలో సేవ్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది.