రామ్‌చరణ్‌ 100 కోట్లు కొట్టాల్సిందే 

రెండో సినిమాతోనే టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని తిరగరాసిన ఘనుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ. మెగాస్టార్‌ చిరంజీవి నట వారసుడిగా ఆయన లెగసీని చాటి చెప్పాడీ యంగ్‌ చిరుత. ‘చిరుత’, ‘ఆరెంజ్‌’ మినహా రామ్‌చరణ్‌ నటించిన అన్ని సినిమాలూ 40 కోట్ల పైన వసూళ్ళు చేసినవే. హిట్టు, ఫ్లాపు అనే తేడాలేమీ లేవు చరణ్‌కి. అంతలా తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని రూల్‌ చేసిన ఘనత చరణ్‌కే దక్కుతుంది. ఏ సినిమా చేసినా అది 40 కోట్లు దాటాల్సిందే. సినిమా తేడా కొట్టినాసరే. ఇది రామ్‌చరణ్‌ గురించి ఇండస్ట్రీలో బలపడ్డ విషయం. అయితే తెలుగు సినిమా బాక్సాఫీస్‌ లెక్కలు మారాయి.

 ‘మగధీర’ సినిమా టాప్‌ 3 లీగ్‌లోంచి తప్పుకుంది. వసూళ్ళ పరంగా దాన్ని మించిన సినిమాలొచ్చాయి. ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ టాప్‌ 3 ప్లేస్‌లోకి వచ్చేశాయి. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రం ఉంది. అల్లు అర్జున్‌ కూడా ‘సరైనోడు’తో సత్తా చాటాడు. దాంతో చరణ్‌ ఇప్పుడు తొందరపడక తప్పదు. డైరెక్ట్‌గా 100 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటాలి. అప్పుడే లీగ్‌లో రామ్‌చరణ్‌ మెగా రన్నర్‌ అవుతాడు. ప్రస్తుతం అభిమానులు ‘ధృవ’పైనే అన్ని అంచనాలూ పెట్టుకున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆల్‌ ది బెస్ట్‌ టు రామ్‌చరణ్‌?