రాణీముఖర్జీ ని పట్టాడు 5 కోట్లు కొట్టాడు

ఐటీ శాఖకు షాకిచ్చింది బాంబే హైకోర్టు. ఓ ఇన్ఫార్మర్ కు ఐదు కోట్లివ్వకుండా ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల ఆస్తుల వివరాలను రహస్యంగా అందించడంలో ఐటీ శాఖకు కొంతమంది సహకరిస్తుంటారు. అలాంటి వారికి కమిషన్ ఇస్తుంటుంది ఆదాయపన్ను శాఖ.

అలాంటి వారిలో ఒకరు… బాలీవుడ్ స్టార్స్ రాణీముఖర్జీ, శేఖర్ సుమన్, బాలాజీ టెలీఫిలింస్ లతో పాటు 17 మంది వీఐపీల ఆస్తుల వివరాలను ఐటీ శాఖకు అందించాడు. దీంతో ఐటీ శాఖ నోటీసులు పంపి.. దాడులు చేసి పన్ను వసూళ్లు రాబట్టింది. ఇలాటి కేసుల్లో 7.1 శాతం రేటు కట్టి ఇన్ఫార్మర్లకు నజరానా ఇస్తుంటుంది ఐటీ డిపార్ట్ మెంట్.

అయితే ఈ విషయంలో అతనికి ఎలాంటి రుసుము ఇవ్వలేదు. దీంతో ఇన్ఫార్మర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారించిన బాంబే కోర్టు.. ఐదు కోట్లు ఇవ్వాల్సిందిగా ఐటీశాఖను ఆదేశించింది