అమలాపాల్‌ చేసిన తప్పేంటి?

అమలాపాల్‌ నేచురల్‌ బ్యూటీతో ఆకట్టుకుంటుంది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం ఆమెది. తమిళంలో ఎన్నో హిట్‌ సినిమాలు చేసింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని సెటిలయిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్యాడింది ఈ నేచురల్‌ బ్యూటీ.

అయితే పెళ్లయినాక కూడా సినిమాల్లో నటించడం మానలేదు. ఇలా నటిస్తూ ఎంతో మంది హీరోయిన్స్‌కి ఇన్సిపిరేషన్‌ అయ్యింది కూడా. పెళ్లయినా కూడా అమలాపాల్‌లా మేము కూడా సినిమాల్లో నటిస్తాం అంటూ చెప్పుకొచ్చారు కొందరు ముద్దుగుమ్మలు. అయితే ఇప్పుడు అమలాపాల్‌ జంట గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయం అధికారికంగా కూడా డిక్లేర్‌ అయిపోయింది. ప్రేమించి పెళ్లాడిన ఈ జంట ఇప్పుడు ఎందుకు విడాకుల దిశగా పరుగుల తీస్తున్నారు? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ విషయంపై అమలా, విజయ్‌ మౌనంగా ఉన్నారు. కలిసి జీవనం సాధించలేమనే నిర్ణయానికి వచ్చి విడిపోవడమే బెటరనుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల నుంచి నెగిటివ్‌గా ఒత్తిడి ఎక్కువయిన కారణంగానే వీరి వ్యవహారం ఇంతగా వివాదాస్పదమయ్యింది. ప్రస్తుతం అమలాపాల్‌ తమిళంలో చాలా బిజీగా ఉంది. రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. అవకాశం వస్తే తెలుగులో కూడా నటిస్తానంటోంది ముద్దుగుమ్మ అమలాపాల్‌.