కేంద్రంపై గర్జించిన నందమూరి సింహం

వాళ్ళు కాదు..వీళ్ళు కాదు విమర్శంటే నందమూరి నటసింహం బాలయ్యే చెయ్యాలి.అంత ఘాటుగా ఉంటుంది బాలయ్య ప్రేమయినా విమర్సయినా.అందులోను ఆంధ్ర ప్రజలంతా రగిలిపోతున్న ప్రత్యేక హోదా అంశం అంటే బాలయ్య మరింత ఘాటుగా స్పందించారు.కేంద్రం పై బాలయ్య చేసిన విమర్శనాత్మక కవిత్వం తెలుగోడిలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదని ఆ వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తు చేస్తోంది.

బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సచివాలయం వచ్చారు.ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి విలేకరులతో ముచ్చటించారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం పై కేంద్రం ఆడుతున్న దొంగాటపై బాలయ్య ఘాటుగానే సమాధానమిచ్చారు.

పరిణామాలు తీవ్రంగా ఉంటాయి,చేయాల్సిందంతా చేస్తున్నాం అయినా అనాధ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం ఆదుకోకుంటే ఫలితం అనుభవిస్తారు..జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయంటూ బాలయ్య చాలా తీవ్రంగానే స్పందించారు.ఈ సందర్బంగా బాలకృష్ణ తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఓ శ్లోకం చెప్పారు.

“ఏటికో ఈ దిక్కుమాలిన జోహార్లు..దేనికో సిగ్గులేని తెగతెంపులు..ఎలకో రాయబారామని బేల మొఖం.. ఎందుకో రాష్ట్ర లబ్ధికై ఇంత రగడ …యాచనమనేదే ఎరుగని ఆంద్ర రాష్ట్రం ఇంత దిగజారిపోయింది ఎంత వింత సిగ్గు చేటు..ఇదిగో మన ముక్తి భుక్తి మనచేతియందే కలదు..పరమ ముష్టి ఎత్తుకొనుట యందు కాదు”

ఈ ఒక్క శ్లోకం చాలు తెలుగు జాతి ఏంటో ..దాని గొప్పతనమెంతో చెప్పడానికి.సినిమాల్లో డైలాగ్స్ చెప్పడమే కాదు నిజ జీవితం లో కూడా బాలయ్య తెలుగువాడి వాడి వేడి చూపించాడు.శబాష్ బాలయ్య.