ఎన్టీఆర్ సమంత కి 26 లింకేంటి?

జనతా గ్యారేజ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం కేరళలో వాటర్ ఫాల్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై పాట చిత్రీకరణ జరుగుతోంది.దీనికి సంబంధించి సమంత ఓ రేంజ్ లో వాటర్ ఫాల్ దగ్గర సందడి చేస్తున్న దృశ్యాలు బయటపెట్టింది.

అయితే ఎన్టీఆర్ ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసేసాడు.తన 25 వ సినిమా నాన్నకు ప్రేమతో ద్వారా భారీ హిట్ కొట్టేసాడు ఎన్టీఆర్.ఇంకో వైపు సమంతాకూడా తన చివరి చిత్రం అ..ఆ తో భారీ విజయాన్నందుకుంది.అ..ఆ కూడా సమంత కెరీర్ లో 25 వ చిత్రం కావడం గమనార్హం.అలా ఎన్టీఆర్ సమంత ఇద్దరికీ ఈ సినిమా 26 వ దే..ఇద్దరు తమ 25 వ చిత్రాలతో భారీవిజయాన్ని సొంతం చేసుకున్న వాళ్లే.

ఈ సినిమాలో సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది.కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమంత ఎన్టీఆర్ ఇద్దరి కెరీర్ లో 26 వ సినిమా మరో మైలురాయిగా నిలిచిపోతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.