ఒలింపిక్స్‌లో అది కూడా ఉండాలట

కాంస్య పతకంతో ఒలింపిక్స్‌లో పరిపెట్టుకున్న యోగేశ్వర్‌దత్‌, ఆ పతకాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం క్రీడా లోకాన్ని నివ్వెరపరిచింది. రియో ఒలింపిక్స్‌లో యోగేశ్వర్‌ దత్‌ నిరాశపరిచాడు. అయితే అంతకు ముందు ఒలింపిక్స్‌లో అతనే హీరో. స్వర్ణం, రజతం కాకపోయినా కాంస్య పతకం సాధించి దేశం దృష్టిని ఆకర్షించాడు.

ఆ సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది రజత పతకం సాధించిన విజేత, డోప్‌ పరీక్షల్లో విఫలమయ్యాడు. తద్వారా ఆ ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి రజత పతక విజేత అయిన బెసిక్‌, ఒలింపిక్‌ గేమ్స్‌లో అంతకు ముందు రెండుసార్లు స్వర్ణ పతకాల్ని కూడా సాధించాడు. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. ఒలింపిక్స్‌ సమయంలో తీసుకున్న శాంపిల్స్‌ని పరీక్షలకు పంపడంతో డోపింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది. తన కాంస్య పతకం రజత పతకంగా అప్‌గ్రేడ్‌ అయిన విషయం అధికారికంగా ధృవీకరించుకున్నట్లు యోగేశ్వర్‌దత్‌ వెల్లడించాడు.

అదృష్టం, సుడి అంటే ఇదే. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. రియో ఒలింపిక్స్‌లో మనోడు అంచనాల్ని అందుకోలేకపోవడంతో కొన్ని విమర్శల్ని ఎదుర్కొన్నాడు. అయితే 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకం రజతంగా అప్‌గ్రేడ్‌ అవడంతో ఆనాటి పతకానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా హీరో అయ్యాడు యోగేశ్వర్‌దత్‌.