‘బ్రహ్మూెత్సవం’ సినిమా నిరాశపరచడంతో కాజల్ కెరీర్ అటకెక్కిందని అంతా అనుకున్నారుగానీ, కాజల్ కెరీర్ కొత్తగా యమ స్పీడుగా సాగుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేస్తున్న కాజల్, పవన్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్‌ని దక్కించుకున్నట్లు సమాచారమ్. ఇది కాకుండా అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి కూడా కాజల్ పేరునే పరిశీలిస్తున్నారు.
ఇంకో వైపున సుకుమార్ దర్శకత్వంలో చేసే సినిమాకి చరణ్, కాజల్ పేరునే ప్రిఫర్ చేస్తున్నాడట. కాజల్ జోరు చూసి షాక్ తింటున్నారట ఇతర హీరోయిన్లు. ‘బ్రహ్మూెత్సవం’ ఇచ్చిన షాక్‌తో నెంబర్ వన్ ప్లేస్ నుండి కాజల్ తప్పుకున్నట్లే అనుకున్న వాళ్లంతా కాజల్ దూకుడు అర్ధం కాక సతమతమవుతున్నారట. యంగ్ హీరోయిన్లు రాశీఖన్నా, రెజీనాలతో పాటు ఈ మధ్య మొదటి సినిమాతోనే హిట్ ఖాతా తెరిచిన ముద్దుగుమ్మలు కూడా ఈ విషయం తెలుసుకుని కాజల్ మీద అసూయ పడుతున్నారట.
ఏది ఏమైనా చిరంజీవి సినిమాలో ఛాన్స్ దక్కడంతో కాజల్ లైఫ్ మళ్లీ టర్న్ అయ్యిందంటున్నారు. ఈ టర్నింగ్ పాయింట్‌తో ఇక ఇప్పట్లో కాజల్‌ని దాటించే సత్తా మరో హీరోయిన్‌కి లేదని కూడా అంటున్నారు. పవన్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నానంటోంది కాజల్. అంతేకానీ ఆ సినిమా విజయమా, పరాజయమా అనే విషయాన్ని నేనింత వరకూ గ్రహించలేదంటోంది. ఈ తరహా ఆలోచనా ధోరణే కాజల్‌ని మున్ముందుకు దూసుకెళ్లేలా చేస్తోంది. మళ్లీ మళ్లీ మంచి మంచి ఛాన్సెస్ అందుకునేలా చేస్తోంది. దటీజ్ కాజల్. కీప్ ఇట్ అప్ కాజల్.