ప్రత్యేక హోదా కూడా వ్యాపారమేనా టీజీ?

దేశం లో పార్లమెంటు ఉభయ సభల్లో కూర్చున్న వారిలో అధికభాగం పారిశ్రామిక వేత్తలే కావడం మన దురదృష్టం.ఎవరికి వారు వారి వారి వ్యాపార విస్తరణ,సంరక్షణకు రాజకీయాల్లోకి రావడం పార్లమెంటుకెళ్ళి కాలక్షేపం చెయ్యడం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే ఎంపీ లు మన దేశం లో చాలా తక్కువ.ఇక మన రాష్ట్ర ఎంపీ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.

ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాడు.ఏ నాడు ప్రజా సమస్యలపై పోరాడిన పాపాన పోలేదు.పోరాటం దాకా ఎందుకు కనీసం సమస్యలపై నోరైనా విప్పలేదు.అయితేనేం రాజ్యసభకు నామినేట్ అయిపోయారు.ఆయనెవరో కాదు రాయలసీమ రాజకీయ వేత్త కాదు కాదు వ్యాపార వేత్త అయిన టీజీ వెంకటేష్ గారు.అనూహ్యంగా ఈయన టీడీపీ లో చేరడం..ఎవ్వరికి అంతుపట్టకుండా చంద్రబాబు ఈయనకి రాజ్యసభ సీటివ్వడం అందరిని విస్మయానికి గురిచేసింది.ఏదయితేనేం సార్ గారు ఎంచక్కా తన వ్యాపారాభివృద్దే లక్ష్యం గా రాజ్యసభలో అడుగుపెట్టేసారు.

కుక్కతోక వంకర అన్న చందాగా ఈ వ్యాపార వేత్తలకు ఎక్కడికెళ్లినా వ్యాపార బుద్దులు మాత్రం పోవు.ఆంధ్రులంతా నినదిస్తున్న ప్రత్యేక హోదా అంశం పై ఈయన గారు బిజినెస్ ఐడియా ఒకటి వదిలారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇస్తే.. జీఎస్టీ బిల్లు ఆమోదిస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తే త‌ప్ప‌కుండా ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ంటూ బేరం పెట్టాలంటూ టీజీ గారు ఉచిత సలహా పడేసారు.

అయినా రంగులు మార్చడం లో ఈయనకి ఈయనే సాటి..ఇదే విషయం మనం రాష్ట్ర విభజన సమయం లో చూసాం. అప్పటివరకు సమైక్యఆంధ్ర కోసం గర్జించి చివరినిముషంలో ప్లేట్ ఫిరాయించిన వాళ్లలో కావూరి సాంబశివ రావు ,టీజీ ఇద్దరు తోడు దొంగలే.చేతనైతే నీవంతు సాయం చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడు అంతే కానీ అనవసరంగా నీ వ్యాపారబుద్దులు ప్రజా ప్రయోజనాలపై రుద్ది రాజకీయాల్ని మరీ దిగజార్చకు ప్లీస్.