చంద్రన్నా గల్లా కబ్జా చేసేశాడన్నా

ఆంధ్రప్రదేశ్ లో బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరైన గల్లా జయదేవ్ టీడీపీ తరపున ఎంపీ గా గుంటూరు పార్లమెంటు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ తో సహా అనే క వ్యాపారాలు ఫ్యాక్టరీలు వీరి సొంతం. జయదేవ్ తల్లి కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి మళ్ళీ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తల్లి కొడుకులిద్దరూ.అయితే అనూహ్యంగా గల్లా అరుణకుమారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలవగా గల్లా జయదేవ్ మాత్రం ఎంపీ గా విజయం సాధించారు.ఈయన టీడీపీ పార్టీ కీ, గుంటూరు ఎంపీ నియోజక వర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలకు భారీగా నిధులు సమకూర్చారని అప్పట్లో బాగానే ప్రచారం సాగింది.

అయితే తాజాగా ఎంపీ గల్లా జయదేవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. గల్లా జయదేవ్ తన భవనాన్ని తక్కవ రేటుకు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని గుంటుపల్లి పద్మజ అనే మహిళ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.గల్లా తమ భవనాన్ని కాజేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. రూ.8కోట్లు విలువచేసే భవనాన్ని రూ.3.9కోట్లకు దక్కించుకోవాలని చూస్తున్నారని పద్మజ వాపోయారు.

దీనిపై జయదేవ్ వాదన ఇంకోలా వుంది.ఆంధ్రాబ్యాంక్‌కు పద్మజ రూ.2.8 కోట్లు బకాయి పడ్డారని, బ్యాంక్ వేలంలో రూ.3.09కోట్లకు ఇంటిని కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. హైకోర్టు స్టే ఇచ్చి తర్వాత వెకేట్ చేసిందని, 25 శాతం డబ్బు వేలం రోజే చెల్లించామని, ఇందులో ఎలాంటి కబ్జా లేదని జయదేవ్‌ స్పష్టం చేశారు.ఇందులో ఎవరి వాదన నిజమో తెలియదు కానీ గల్లా పంచాయితీ మాత్రం చంద్రబాబు వద్దకెళ్లింది.