పట్టిసీమ పరవళ్లు భళా

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఆ పరిస్థితి కృష్ణా నది లో లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఒట్టిపోతోన్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి ఇన్‌ఫ్లో కూడా లేదు. మరో వైపు అడపాదడపాగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న నీటి నిల్వ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి అవసరాలకే అంతంత మాత్రంగా సరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో డెల్టా రైతులు కొన్ని రోజులుగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి వరద నీరు ఎప్పుడు కృష్ణానదికి వస్తుందా అని ఎదు రు చూస్తున్నారు.

రెండు రోజుల క్రితం నదిపై ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట నుంచి లక్షా 50 వేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిసి సంతోషించారు. ముఖ్యమంత్రి స్వయగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తామని ప్రకటించారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకునేసరికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. తొలుత కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం వ్యవధిలోపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పశ్చిమ డెల్టాకు విడుదల చేస్తారు. నారుమడుల సమయంలో ప్రధాన కాలువకు ఐదు వేల క్యూసెక్కుల నీరు సరిపోతుంది. నారుమడుల కోసం కనీసం నాలుగు టీఎంసీల నీటిని అయినా విడుదల చేయాలని వ్యవసాయ, నీటిపారుదల అధికారవర్గాలు కోరుతున్నాయి. కాలువల్లోకి నీరు రాగానే నారుమడులు పెట్టుకొనేందుకు రైతులు సన్నద్ధమవుతుండగా, వెద పద్ధతిలో సాగు చేసేందుకు కొంతమంది రైతులు ఆలోచన చేస్తున్నారు.

గోదావరి కృష్ణా అనుసంధాన చారిత్రాత్మక ఫలితాలు ఈ ఖరీఫ్ కాలంలో కనిపించబోతున్నాయి. పోలవరం కుడి కాలువ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. పట్టిసీమ పూర్తయింది. గోదావరిలో అప్పుడే వరద ప్రవాహం ఉరకలెత్తుతోంది. ఇప్పటికే 36 టీఎంసీలకు పైగా నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోయింది. మరో పక్క ప్రకాశం బ్యారేజీలోకి చుక్క నీరూ చేరలేదు. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు ఖరీఫ్ సాగు కోసం ఎదురుచూస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, సాగర్ దాటి కృష్ణా డెల్టాకు నీరు అందా లంటే చాలా కాలమే పడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలం ఊపిరిపోయనుంది. గోదావరి కృష్ణా అనుసంధాన చారిత్రాత్మక ఫలితా లు ఈ ఖరీఫ్ కాలంలో కనిపించబోతున్నాయి. పోలవరం కుడి కాలువ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, సాగర్ దాటి కృష్ణా డెల్టాకు నీరు అందాలంటే చాలా కాలమే పడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలం ఊపిరిపోయనుంది. పోలవరం కుడికాలు వలో తమ్మిలేరు, రామిలేరుపై అక్విడెక్టు, అండర్ టన్నెల్ పనులు చివరికొ చ్చాయి. కుడి కాలువపై కొన్ని వంతెనల నిర్మాణాలు మినహా గోదావరి నుంచి 8,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అవసరమైన పనులన్నీ దాదాపు కొలిక్కివ చ్చాయి. వర్షాల అంతరాయం లేకపోతే మిగిలిన కొద్ది పనులు కూడా పూర్తి కానున్నాయి.