కామినేని తురాణం న సిగ్గు న లజ్జ

విజయవాడ ఆలయాల తొలగింపు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఆధునీకణ పేరుతో ఆలయాలు తొలగించడాన్ని విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఖండించింది. అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా వారు బెజవాడ వినాయక గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు మంత్రి కామినేని ముఖ్య అతిధిగా హాజయ్యారు. సభలో భక్తులకు పలు హామీలు ఇచ్చారు. తొలగించిన ఆలయాలు విగ్రహాలను పునఃప్రతిష్టేంచుదుకు కృషి చేస్తానన్నారు. భక్తులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు.

అధికారుల తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రజా ప్రతినిధులకు ఏలాంటి సంబందం లేదని మొత్తం అధికారులమీదకి నెట్టి చేతులు దులిపేసుకున్నారు. దీనిపై కొంతమంది కావాలనే దృష్ర్పచారం చేస్తున్నారన్నారు.ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహించదని,అన్ని మతాల సంప్రాదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని,అందరితో కలుపుకోని వెళతామని ఉచితోపన్యాసం దంచేసారు. నిన్న చంద్రబాబు ఇచ్చిన ప్రవచనాలనే ఈ మంత్రిగారు కొనసాగించారు. ఇంకా విగ్రహాల ను తొలగిచడం తప్పేనని వివరణ ఇచ్చారు. సీయం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు.ఇదో పెద్ద కామెడీ. విగ్రహాలను మున్సిపల్ చెత్తబుట్టల్లో పడేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని అధికారులకు సూచించారు. నిన్న పెద్ద బాస్ సూచించారు ఈ రోజు భజన బాస్ మళ్ళీ సూచించారు.విడ్డూరం కాకపోతే ఏంటి అంతా అయ్యాక వీరు సూచించేది వారు పాటించేది .

కానీ, అంతలోనే నిస్సిగ్గుగా మాటమార్చారు మంత్రి కామినేని. అధికారులు రాత్రిబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఎదో చిన్నపాటి పోరపాటు జరిగిందని సర్ది చెప్పుకోనే ప్రయత్నం చేశారు. పూర్తిగా అధికారును వెనుకేసుకొచ్చారు. అడ్డోచ్చిన విగ్రహాలను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాలు , ఆధునీకరణలో భాగంగానే తొలగించారన్నారు. నగరం అబివృద్ది చెందాలంటే రోడ్లు విస్తీరణ ఉండాలన్నారు. దీన్ని కావాలనే కొంతమంది రాద్దాంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పనులకు విఘాతం కల్పించవద్దని కోరారు. తప్పిదాలను కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి నీతి మాలిన మాటలతో భక్తుల మనోభావాలకు ఆటంకం కలిగించారు మంత్రి కామినేని శ్రీనివాస్.

అయ్యా కామినేని నీకు ఖాళీ ఉంటే బాబు కోటి రాసుకో కానీ ఇలా నిస్సిగ్గుగా మాటలు మారుస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేయ్యకు.అసలే భక్తులు బాధలో వున్నారు.చేతనైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఏదయినా చెయ్ లేకుంటే ఇన్నాళ్లు వున్నట్టే ఖాళీగా ఉండు అంతే కానీ,వాళ్లు చేశారు,వీళ్ళు చేశారు అని తుగ్లక్ స్టేట్మెంట్స్ ఇవ్వకు ప్లీస్.