జగపతి బాబు కొత్తగా ట్రయ్ చేసాడట!

స్టీవెన్ స్పిల్ బెర్గ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జురాసిక్ పార్క్ తర్వాత తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయమైపోయిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ‘ద బీఎఫ్ జీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంటే ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అని అర్ధం. ఓ చిన్నారి.. ఓ మహాకాయుడు.. మాయాలోకం. కాన్సెప్ట్ సింపుల్ అయినా.. హాలీవుడ్ లో స్పిల్ బెర్గ్ సినిమాల్లో కనిపించే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి.

జూలై 1న హాలీవుడ్ లో ‘ద బీఎఫ్ జీ’రిలీజ్ కాగా.. ఈ మూవీని నేరుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ పరంగా చాలా రిచ్ గా ఉంది ఈ సినిమా ట్రైలర్. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగపతి బాబు డబ్బింగ్ పాత్ర గురించే. సినిమాలో వృద్ధుడైన భారీకాయుడి పాత్రకు జగపతి చెప్పిన డబ్బింగ్ అదిరిపోయింది. తనకు తెలిసిన అలవాటైన మాడ్యులేషన్ కాకుండా.. కొత్తగా ట్రై చేశాడు మన జేబీ. తెలుగు వెర్షన్ కి సంబంధించి జగపతి వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

లేటెస్ట్ గ్రాఫిక్స్ టెక్నాలజీని ఉపయోగించి తీసిన ద బీఎఫ్ జీ.. విజువల్ గా కచ్చితంగా ఆకట్టుకుంది. జూలై 15న తెలుగు వెర్షన్ రిలీజ్ కానుండగా.. చిన్నారులను ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయనే విషయాన్ని ట్రైలర్ లోనే ప్రొజెక్ట్ చేశారు. ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల ఆధిపత్యాన్ని ఈ బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ కూడా కంటిన్యూ చేసే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే.. హాలీవుడ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు రాలేదనే మాట మాత్రం వాస్తవం.