రేవంత్ రెడ్డి దీక్షకు KCR కౌంటర్-ఇష్యూ క్లోజ్!!

మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెండు దారులు ఉన్నాయని.. ఒకటి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే రెండోది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 123జీవో. వీటిల్లో బాధితులు దేన్నైనా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ బాధితుల కోసం దీక్ష చేస్తున్నట్లు నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఊరుని మింగేసే ప్రాజెక్ట్ వద్దని పిలుపునిచ్చారు.  ఐతే రేవంత్ రెడ్డి దీక్షా శిభిరాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే తెలంగాణ సీఎం ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇక్కడే KCR రాజకీయ చతురత ప్రదర్శించారు.ఇంకా దీక్ష పూర్తి స్థాయిలో సమీకరణే జరగలేదు ఇంతలోనే కేసీర్ కౌంటర్ అటాక్ ఇచ్చేసాడు.ఏదయితేనేం మొత్తానికి మల్లన్న సాగర్ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం లభించబోతోంది.