మ‌హానాడు ముందు విశాఖ నేత‌ల‌కు షాక్‌

అస‌లే మంత్రి ప‌ద‌వులు రాక తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విశాఖ నేత‌ల‌కు సీఎం చంద్ర‌బాబు మ‌రో షాక్ ఇచ్చారు. నామినేటెడ్ ప‌దవుల కోసం కళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్న నేత‌ల ఆశ‌లు ఆవిరి చేసేశారు! ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడులో దీనిపై ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నేత‌ల‌ను నీరుగార్చేశారు. ఎంపీలు – ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు ప్రకటించడంతో ఆ పదవులపై ఆశ పెట్టుకున్న కొందరు విశాఖ నేతలు […]

గంటా ఆస్తుల్లో ప్ర‌భుత్వ భూములు..!

ఏపీ మాన‌వ వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్ర‌భుత్వ భూములు ఆయ‌న ఆస్తుల జాబితాలో ఉండ‌డమే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఆయ‌నేమ‌న్నా ఆ ఆస్తుల‌ను కొనుగోలు చేశారా? అంటే లేద‌ని ఆక్ర‌మించుకున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గ‌తంలో డైరెక్ట‌ర్‌గా ఉన్న ప్ర‌త్యూష కంపెనీకి ఇండియ‌న్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయ‌లు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప‌లువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేష‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ రానున్న రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వాస్త‌వానికి న‌వంబ‌రు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని త‌మ‌కు చెప్పాల‌ని హైకోర్టు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు కావ‌డం, […]

ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే  ప్ర‌స్తుతం ఏపీలో బ‌హిరంగ స‌భ‌ల రాజ‌కీయాల వేడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి దీనికి తెర‌దీసింది మాత్రం.. ఇంకా రాజ‌కీయాల్లో పార్ట్ టైం పాత్ర‌ను మాత్ర‌మే పోషిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే చెప్పాలి.  రాజ‌కీయాల‌పై త‌న దిశ ద‌శ ఎలా ఉండ‌బోతున్నాయో ప్ర‌జ‌ల‌కు స‌వివ‌రంగా చెప్పేందుకంటూ ఆయ‌న తిరుప‌తిలో తొలిసారిగా బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత కేంద్రం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కాకినాడ‌లో మ‌రో స‌భ నిర్వ‌హించారు. […]

విశాఖకు దూరమవుతున్న విద్యాసంస్థలు

ప్రతిష్ఠాత్మకమైన వివిధ విద్యా సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ అవి ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించారు. విభజన నేపథ్యంలో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని విశాఖలో ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పడిన విషయం తెలిసిందే. అందులో కొన్ని […]

వాళ్ళ టార్గెట్ లిస్ట్ లో స్టీల్ సిటీ కూడా!

ఇన్నాళ్లూ తెలంగాణకే పరిమితమైన ఉగ్రవాదుల కదలికలు ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా పోలీసులు సేకరిరచిన సమాచారం అనేక ప్రాంతాల్లో బహిర్గతమవుతున్న కదలికలు చూస్తే ముష్కర మూకలు ఏపీలోనూ పాదం మోపుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువవుతుండడంతో వారు ఆంధ్రాలో తలదాచుకుని, తమ కార్యక్రమాలను కొనసాగించేదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, ఆల్‌ ఖైదా, ఐసిస్‌, పిఎఫ్‌ఐ వంటి సంస్థలు రాష్ట్రంలో పాగా వేసేరదుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు సందేహిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు […]