హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?

అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ […]

ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!

ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే అవకాశముంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళతారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం అడుగుపెట్టకపోవచ్చని తెలుస్తోంది. కారణం ఎన్నికల కమిషన్.. కోవిడ్ కారణంగా వెయ్యి మందికి మించి ఎన్నికల బహిరంగ సభకు హాజరు కాకూడదని […]

కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..

ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]

ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !

హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ  సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. […]