అమెరికాలో జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్!

కొర‌టాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న జ‌నాతా గ్యారేజ్ ఆడియో వేడుకకు వేదిక ఖ‌రారైంది. అమెరికాలో పాటలు విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. తారక్ కు ఓవ‌ర్సీస్‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆడియో రిలీజ్ ను అక్కడ ప్లాన్ చేశార‌ని సమాచారం. ఖ‌మ్మంలోనూ ఈ వేడుక‌ను నిర్వహించేందుకు చిత్రబృందం స‌న్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఆడియో అమెరికాలో విడుదలవడం ఇదే తొలిసారి. అందుకు తగినట్లే ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. […]

హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో నాగచైతన్య?

హరీష్‌ శంకర్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌. హీరోని మాస్‌లుక్‌లోనూ, క్లాస్‌ లుక్‌లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్‌ హరీష్‌. సినిమా ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్‌ చేయమని హరీష్‌ని అడిగాడట. అయితే అఖిల్‌ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్‌. ‘రామయ్యా వస్తావయ్యా’, […]

మావయ్య బాటలో మెగా మేనల్లుడు

మెగా మేనల్లుడిగా ‘రేయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్‌ తేజ. తాజాగా ‘సుప్రీం’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. మేనమామ పోలికలను అంది పుచ్చుకోవడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా మావయ్య చూపిన బాటలోనే అడుగులేస్తున్నాడు. సేవా కార్యక్రమాల్లో సినీరంగంలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. పబ్లిసిటీతో సంబంధం లేకుండా తమ వంతు సేవలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మెగా ప్యామిలీ తరువాతే ఇంకెవరైనా.. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ […]

ముద్రగడ ఏం సాధించారు?

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిరాహార దీక్ష ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని చంద్రబాబు సర్కార్‌ ఇప్పటిదాకా ఆందోళనతో ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన అక్కర్లేదు. దీక్ష విరమించడం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే జరిగింది. అయితే దీక్షతో ముద్రగడ పద్మనాభం ఏం సాధించారు? అని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ప్రశ్నించుకుంటోంది. కేసులు నమోదు కావడం, అరెస్టవడం, బెయిల్‌ రావడం ఇదంతా ఓ ప్రక్రియ. పద్ధతి […]

పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’

కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి […]

జార్జియాలో ‘శాతకర్ణి’ పోరాటం!

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టైటిలే చాలా గంభీరంగా ఉంది. ఇక హీరో బాలయ్య లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. ఇటీవలే విడుదల పోస్టర్ ఆయన అభిమానలోకాన్నే కాక సినీప్రియులు, విమర్శకులను ఆకట్టుకుంది. మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం డైరక్టర్ క్రిష్ పడుతున్న తపన అంతాఇంతా కాదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. జులై 2 నుంచి 22 రోజులు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ఈ షెడ్యూల్ […]

ఇంటి వేటలో సమంతా!

అమాయకత్వం, చిలిపితనం, మరికొంచెం గడుసుతనం తెరపై పండించాలంటే సమంతాకు మించినవారులేరు. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో ఆమె ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమె ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నది భాగ్యనగరంలో కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండడం […]

హిట్టయితే 15 కోట్లు..ఫట్టయితే 5 కోట్లు

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రియలిస్టిక్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ చేసిన ప్రయత్నాలు మరే హీరోనూ చేయలేదు. సినిమాల్లో డబ్బు సంపాదించుకోవటంతోనే పెద్ద స్టార్ గా మారిపోయాము అనుకునే హీరోల్లా కాకుండా, డబ్బుతోపాటు నిజమైన యాక్టర్ గా నిరూపించుకోవాలని తహతహలాడే యాక్టర్ గా కమల్ హాసన్ నిలిచాడు. తను ఎంతైతే ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడో, అంతకు మించి ఇండస్ట్రీలో పోగొట్టుకున్నాడు. ఇప్పుడిప్పటే అటువంటి ప్రయత్నాలు నుండి దూరంగా జరిగి, కాస్త డబ్బుని […]

సింగపూర్ సంస్థకు అమరావతి ఛాన్స్

కొత్త రాజధాని అమరావతి అభివృద్ధి అవకాశాన్ని సింగపూర్‌ కన్సార్టియంకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే సింగపూర్‌ సంస్థకు 58 శాతం ఈక్విటీని ఖరారు చేశారు. ఈ పెట్టుబడికి అదే స్థాయిలో ఆదాయాన్ని కూడా సమకోర్చాలని నిర్ణయిరచారు. సింగపూర్‌ సంస్థకే స్విస్‌ ఛాలెంజ్‌ ద్వారా రాజధాని నిర్మాణ బాధ్యత అప్పగించేందుకు దాదాపు నిర్ణయించిన నేపథ్యంలో ఆ సంస్థకు కల్పించాల్సిన ప్రయోజనాలపైనా అధికారులు విస్తృతంగా కసరత్తు చేశారు. గత నాలుగు రోజులుగా ఇదే అంశాలపై ఉన్నతాధికారులు […]