ఇంటి వేటలో సమంతా!

అమాయకత్వం, చిలిపితనం, మరికొంచెం గడుసుతనం తెరపై పండించాలంటే సమంతాకు మించినవారులేరు. టాలీవుడ్, కోలీవుడ్ ల్లో బ్లాక్ బస్టర్స్ ను ఖాతాలో వేసుకుని జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ లో ఆమె ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆమె ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నది భాగ్యనగరంలో కావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండడం వల్లే కన్వీనియంట్ గా ఉంటుందని ఇక్కడ ఓ ఇల్లు కొనాలని ప్లాన్ చేసి ఉంటుందని కొంతమంది అంటున్నారు. మరోపక్క, టాలీవుడ్ కు చెందిన ఓ యువ హీరోతో సమంతా క్లోజ్ గా ఉంటున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో ఇంతకాలంగా లేని ఆలోచన .. ప్రేమ వ్యవహారం తరువాత రావడమేమిటనేది మరికొందరి సందేహం. సమంతా సొంత ఇంటి ఆలోచన విషయంలో నిజమెంతో తెలియదు గానీ, ఇప్పుడిదే విషయమై అంతా చర్చించుకుంటున్నారు.