అల్పాహారం కింద మొలకలు తింటే ఇన్ని ప్రయోజనాల.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

సాధారణంగా చాలామంది మొలకలను తినడానికి ఇష్టపడరు. కానీ మొలకలలో ఉండే ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండా తింటారు. మొలకలలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. విటమిన్ సి, ఫైబర్ ఖనిజాలు ఎక్కువగా నిండి ఉంటాయి.

అలాగే ఇవి తినడం ద్వారా జీర్ణ క్రియ కు సహాయపడే ఎంజైయ్ లు ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి కూడా. ఇక మొలకలలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడడంతోపాటు పోలిసం ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అలాగే చర్మం యవ్వనంగా ఉండడానికి సహాయ పడుతుంది.

విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మొలకల లో ఉండే ఫోలేట్, విటమిన్ కె మెదడు పనితీరును మెరుగుపరిస్తాయి. మొలకలలో ఉండే పోషకాలు జీర్ణ క్రియను పెంచుతాయి. అలాగే శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మొలకలను తప్పకుండా తినాలి. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు.