“గుర్తు పెట్టుకోండి నా కొడకల్లారా..ఎప్పటికీ దయ చూపేదే లేదు” ..ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో అద్భుతంగా క్రియేట్ చేసి ఎన్టీఆర్ లోని మరో వైల్డ్ యాంగిల్ ని బయటపెట్టారు . మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పాలి .

దేవర గ్లింప్స్ బట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా వైల్డ్ లుక్ లో కనిపించబోతున్నాడు . మనకు గ్లింప్స్ స్టార్టింగ్ లోనే భారీ పడవల్లో చాలామంది దోచుకోవడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తారు . అప్పుడే ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇస్తాడు .

 

అంతేకాదు అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరుక్కుంటూ పోతూ తనలోని వైల్డ్ యాంగిల్ ని బయటపెడతాడు . అంతేకాదు సముద్రం గొప్పతనాన్ని వివరిస్తూ అనిరుధ రాసిన లిరిక్స్ కి హైలెట్ గా మారాయి . ఏ భాషలో రాస్తే ఏ ప్రాబ్లం వస్తుంది అనుకున్నాడో ఏమో ఇంగ్లీషులో లిరిక్స్ రాసి అభిమానులను ఫిదా చేశాడు . You never touch the sea.. You never play with me.. I’ll never show you mercy.. I’ll never let you be!

కాగా ఎన్టీఆర్ అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నరుక్కుంటూ పోతూ బాగా క్రూరంగా కనిపిస్తాడు. అంతేకాదు చివరిలో ఓ డైలాగ్ కూడా చెప్తాడు. ” ఈ సముద్రం చేపల కంటే కత్తులని నెత్తురుని ఎక్కువగా చూసి ఉంటాది అందుకేనేమో

దీనిని ఎర్ర సముద్రం అన్నారు “అంటూ చాలా చాలా బోల్డ్ గా డైలాగ్ చెప్తాడు . సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ గ్లింప్స్ లోని డైలాగులను ట్రెండ్ చేస్తున్నారు .

అంతేకాదు “నా కొడకల్లారా ఇక అడ్డు వస్తే ఎవరి పై దయ చూపేలేదే లే నరుక్కుంటూ పోవుడే ” అంటూ దేవర స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు . మరెందుకు ఆలస్యం గూస్ బంప్స్ తప్పించే దేవర గ్లింప్స్ ని మీరు కూడా చూసేయండి..!!