డబ్బులిచ్చి మరి నా సినిమాలపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ క్వీన్ కంగనా ర‌నౌత్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ పలు సినిమాలో నటించి మెప్పించింది. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన ఈమె తర్వాత అడ‌ప‌ద‌డ‌పా సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయితే బాలీవుడ్‌కు మక్కాం మార్చి అక్కడ వరుస‌ సినిమా ఆఫర్లను కొట్టేసిన కంగనా .. సినిమాల్లో కంటే కాంట్రవర్షీలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో మహిళల పరిస్థితులు చూస్తుంటే తన గుండె తరుక్కుపోతుందంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం సినిమాలో ట్రెండ్ చూస్తుంటే భయంకరంగా ఉందని.. మహిళల పరువును, వారి బట్టలను హింసాత్మకంగా, ఇన్స‌ల్ట్ చేసే విధంగా గోడమీద పువ్వు లాగా మార్చేస్తున్నారంటూ వివ‌రించింది. ఇవన్నీ చూస్తుంటే నేను సినిమాల్లోకి వచ్చిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అసభ్యకరమైన ఐటెం నెంబర్లు, మూగ పాత్రలు ప్రభలంగా ఉన్నాయి. కాగా చాలా ఏళ్లుగా వేతన సమానత్వం కోసం పోరాడుతున్నా అంటూ వివరించింది. ఇక గ్యాంగ్స్టర్, ఒల్వో, ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక, తలైవి, తేజస్ లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా అందుకే నిర్మించానంటూ వివరించింది.

య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్, ధర్మ వంటి పెద్ద ప్రొడక్షన్స్ కు వ్యతిరేకంగా వెళ్లాన‌ని చెప్పుకొచ్చిన కంగనా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి పెద్ద హీరోల సినిమాల‌కు నో చెప్పానని వివరించింది. కానీ నాకు వారితో వ్యక్తిగతంగా వైరమేమీ లేదు.. కేవలం మహిళా సాధికారత కోసమే నేను పోరాడుతున్నా.. అలాంటిది నేటి సినిమాల్లో మహిళల స్థితిగతులు చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది.. దానికి సినీ పరిశ్రమ మాత్రమే కారణమా.. సినిమాలో స్త్రీల ఈ విపరీతమైన ధోరణికి ఆడియన్స్ పార్టనర్షిప్ లేదా.. అంటూ పోస్ట్ చేసింది.

అంతేకాకుండా తన సినిమాలపై చేస్తున్న నెగిటివ్ పబ్లిసిటీ పై కంగనా తన ట్విట్‌లో ప్రస్తావిస్తూ నా సినిమాలకు డబ్బులు ఇచ్చి మరి త‌ప్పుడు ప్రచారం చేయించడం ఈ మధ్యన మరీ ఎక్కువైంది.. అయినా నేను ఇప్పటికీ అలాంటి వారిపై పోరాడుతా.. కానీ ప్రేక్షకులు కూడా మహిళలను కేవలం లైంగిక వస్తువుగా భావించి బూట్లు నాకమని అడిగే సినిమాలు ప్రోత్సహిస్తున్నారు. ఇది స్త్రీల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న వారిని చాలా హర్ట్ చేస్తుంది. రాబోయే కాలంలో మహిళా సాధికారత మూవీలే కెరీర్‌గా ఎంచుకున్న నా జీవితంలో మరింత విలువైన టైం ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ ఆ ట్విట్ లో రాసుకొచ్చింది.