బన్నీ-తారక్ సీక్రేట్ ఒప్పందం.. మధ్యలో మహేశ్ బాబుని బకరా చేసేసారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నారా ..?? అంటే ఎస్ అనే ఆన్సర్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యాన్స్ ఎలా కొట్టుకొని చస్తూ ఉంటారో. సోషల్ మీడియా వేదికగా చాలామంది హీరోల ఫ్యాన్స్ పలు వివాదాలకు తెర లేపుతూ ఉంటారు. అయితే వాళ్లలోకి డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు బన్నీ -తారక్ ఫ్యాన్స్ .

“మీకు మేము మాకు మీరు ” అనే కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు . గతంలో అలా వైకుంఠపురం సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు . ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాకి బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. అలాగే సింహాద్రి రీ రిలీజ్ టైంకి బాగా సపోర్ట్ చేశారు బన్నీ ఫ్యాన్స్. ఆ తర్వాత పుష్ప సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు . ఇప్పుడు దేవరకి ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ .

అయితే మధ్యలో మహేష్ బాబును మాత్రం ఒంటరి చేసేసారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించి అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోని మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా..” మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు దయచేసి చెడ దొబ్బొద్దు ..ట్రోల్ చేయొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు”. దీంతో బన్నీ-తారక్..మహేశ్ బాబు ను ఒంటరి చేసేసిన్నట్లు అయ్యింది..!!