మన రమణగాడికి అలాంటి జబ్బు ఉందా..? ట్రైలర్ లో హింట్ ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..!!

గుంటూరు కారం .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. ఎంతలా అంటే కుర్రాళ్ళకి నర నరాల్లోకి ఎక్కేసింది . మరీ ముఖ్యంగా చిన్నపిల్లల సైతం ఆ కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే గుంటూరు కారం ట్రైలర్ కి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం ట్రైలర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు కంట్లో నిప్పురవ్వ పడినట్లు చూపిస్తారు. అంతేకాదు ఆ తర్వాత కూడా మహేష్ బాబు – శ్రీ లీలని చూసేటప్పుడు ఒక కంటితోనే చూసినట్లు మనకి చూపిస్తాడు . దీన్నిబట్టి మహేష్ బాబుకి ఏదైనా కంటికి సంబంధించిన జబ్బు ఉన్న మనిషిగా త్రివిక్రమ్ చూపించబోతున్నాడా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి పడి , పలు అడ్డంకులు తట్టుకొని ఈ సంక్రాంతికి జనవరి 12న వస్తుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో శ్రీలీల(శ్రీలీల), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్, మూడు పాటలు కూడా రిలీజ్ చేశారు..!!