బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరు విన్నర్గా ఒకరు రన్నర్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఇద్దరు కంటెస్టెంట్లకు మధ్యన హౌస్ లో జోరుగా పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ కంటెస్టెంట్ల మధ్యన ఎటువంటి వివాదాలు లేకపోయినా.. వీరి ఫ్యాన్స్ వల్ల జరిగిన రచ్చ వాతావరణంలో పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే తాజాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్క ఛానల్ లో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్టార్ మా లో నా సామిరంగా అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో నాగార్జునతో పాటు బిగ్‌బాస్ కార్యక్రమంలో సందడి చేసిన అందరి కంటెస్టెంట్లు, సీరియల్ నటులు పాల్గొని సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అమర్, పల్లవి ప్రశాంత్ మధ్యన పోరు మొదలైంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్, అమర్ మరోసారి గొడవ పడుతూ ఈ వీడియోలో కనిపించారు. ప్రశాంత్ జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే మొదటి కార్యక్రమం కావడం గమనార్హం. ఇక ఈ కార్యక్రమంలో శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఒక బ్యాచ్ గా.. అమర్, శోభ, ప్రియాంక శెట్టి మరొక బ్యాచ్ క డివైడ్ అయ్యారు.
శివాజీ ఊరి పేరు మొగ్గాపురం, అమర్‌వాళ్ళ ఊరు పేరు చుక్కాపురం. ఇక ఈ బ్యాచుల డివైడ్ అయ్యారు. ఈ రెండు బ్యాచ్లు నాగార్జునను మా ఊరికి తీసుకువెళ్లాలి అంటే మా ఊరికి తీసుకువెళ్లాలి అంటూ పోటాపోటీగా గొడవ పడ్డారు. దీంతో ప్రశాంత్ బరాబర్ నాగార్జున సర్ మా ఊరికి వస్తారు.. ఈ విషయంలో తగ్గేదెలా అంటూ సవాల్ విసిరాడు. అమర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే మరోసారి ఇలా నాగార్జున ముందే ఈ కంటెస్టెంట్లు ఇద్దరు గొడవపడుతూ సవాలు విసురుకున్నారు. కానీ ఇదంతా కేవలం ఆ షోలో భాగంగానే చేసినట్లు క్లియర్ గా తెలుస్తుంది.