వెకేష‌న్‌కు వ‌రుణ్‌-లావ్‌… న్యూ క‌పుల్ డ్రీమ్‌ప్లేస్ ఎక్క‌డంటే…!

మెగా కుటుంబంలో రీసెంట్గా వరుణ్, లావణ్యాల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటూ.. తాజాగా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ సైతం జరుపుకున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు కూడా.

ఇక ఈ జంట పెళ్లి అనంతరం తమ హ్యాపీ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట.. తాజాగా ఓ ఫోటోని షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి ఓ వెకేషన్ కి వెళ్తున్నట్లు ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ జంట తమ కి ఎంతో ఇష్టమైన యూరప్ కి వెళ్తున్నారట. ఈ క్రమంలోనే వీరి హ్యాపీ మూమెంట్స్ ని ఫాన్స్ తో పంచుకున్నారు.

ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి ఫోటోలు చూసిన ప్రేక్షకులు… మీరెప్పుడూ ఇలానే సుఖసంతోషాలతో హ్యాపీగా ఉండాలి. మీ మధ్య ఎటువంటి మనస్పార్ధాలు రాకూడదని కోరుకుంటున్నాము. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)