చిన్న‌ప్ప‌టి క‌ష్టాల‌పై ఎమోష‌న‌ల్ అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్‌…!

తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మనందరికీ సుపరిచితమే. కమల్ హాసన్ ” విక్రమ్ ” సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల ఈయ‌న దర్శకత్వంలో విజయ్ హీరోగా.. త్రిష హీరోయిన్ గా ” లియో ” సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం లోకేష్ స్టార్ రజినీకాంత్ 171 వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే లోకేష్ నిర్మాతగా మారాడు. జీ స్క్వాడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.

విజయకుమార్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ” ఫైట్ క్లబ్ “. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ కార్యక్రమం నిర్మించగా.. అందులో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ” దర్శకుడిగా ఆదరించినట్లే నిర్మాణ సంస్థను ఆదరించాలని కోరుకుంటున్నాను. డబ్బు సంపాదించడానికి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించలేదు.

దర్శకుడిగా నేను బాగానే సంపాదిస్తున్నాను. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా కష్టాలను అనుభవించాను. నేను రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ కు నా మిత్రులు ఎంతో సహాయం చేశారు. వారి సాయంతోనే మానగరం సినిమాని రూపొందించాను. అలాంటి మిత్రులు, ప్రతిభావింతులను ప్రోత్సహించడం కోసం మీ జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించాను. దాని ద్వారా వచ్చిన డబ్బులను మళ్లీ చిత్ర పరిశ్రమలోనే పెడతాను ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.