యానిమల్ సినిమా ఆ హీరో చేసుంటే ఇంకా బాగుండేదా..? 1000 కోట్లు కలెక్ట్ చేసుండేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే డైలాగ్స్ ను ఎక్కువగా యూస్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎలాంటి హై పెర్ఫార్మెన్స్ ఉన్న నటనను కనుబరుస్తాడో మనకు తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన ఇతగాడు.. ఆ తర్వాత అలాంటి రేంజ్ హిట్ తన ఖాతాలో వేసుకోలేదు .

అయితే రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రన్బీర్ కపూర్ తో రష్మిక చేసిన రొమాన్స్ బాగానే ఉంది అని.. కానీ రన్బీర్ ప్లేస్ లో నిజంగానే విజయ్ దేవరకొండ నటించి ఉంటే మాత్రం 100 కోట్లు కాదు 200 కోట్లు మొదటి రోజే కలెక్ట్ చేసి ఉండేది అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఎలాగో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అని ప్రూవ్ అయిపోయింది . ఈ క్రమంలోనే వాళ్ళు అలా ఆన్ స్కిన్ కెమిస్ట్రీలో హద్దులు మీరిపోయి ఉంటే సినిమాకి కూడా బాగా కలిసి వచ్చేది అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ల మధ్య ప్రేమాయణం మరోసారి వైరల్ గా మారింది..!!