ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్‌కు నేనా… నితిన్ ఇలా అనేశాడేంటి….!

నితిన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మనందరికీ తెలిసిందే. నితిన్ తన ప్రతి సినిమాలోను.. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతూ ఉంటాడు. స్వయంగా ఈ విషయాన్ని నితినే ” భీష్మ” సినిమా ప్రమోషన్స్లో తెలియజేశాడు. కానీ ఎందుకో తెలియదు కానీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతున్న.. అది చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అందుకు ఈరోజు జరిగిన ” ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ” సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఉదాహరణగా తీసుకోవచ్చు.

అసలు విషయం ఏమిటంటే..మీ ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడుతారు కదా? అంటూ ఓ రిపోర్టర్ నితిన్ ను ప్రశ్నించగా..” నేను కాదు మీరే అడుగుతారు. మళ్లీ థంబ్ నైల్ లో దాని గురించి పెట్టి వైరల్ చేస్తున్నారు ” అంటూ కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇక ఈ క్రమంలోనే మరో రిపోర్టర్.. మీరు రాబోయే ఏపీ ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు పలుకుతారా? అని ప్రశ్నించగా..

” నేను సపోర్ట్ చేస్తే ఆయన గెలిచేస్తాడా. నా రేంజ్ ఆయన కంటే గొప్పదా. ఆయన ఒక్కరు చాలు ” అంటూ ఘాటు సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అనేక వివాదాలు, విమర్శలు ఫేస్ చేస్తున్న సందర్భంలో నితిన్ వాటికి దూరంగా ఉండడానికి ఇలా స్పందించినట్లు తెలుస్తుంది. లేకపోతే తన నెక్స్ట్ సినిమాకి ” తమ్ముడు ” అనే టైటిల్ ను ఎలా పెట్టుకున్నాడు? పవన్ పై అభిమానం లేకపోతే.. తమ్ముడు సినిమా గెటప్ ఎందుకు వేశారు? అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.