పరగడుపున వేడి నీటిలో నెయ్యి కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. అవేంటో తెలిస్తే రోజు తాగుతారు..?

ఇటీవల లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరూ ఆహార పద్ధతులు , డైలీ వెల్నెస్‌ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి పద్ధతుల్లో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం ఒకటి. ఈ శక్తివంతమైన విదానం పురాతన కాలం నుంచి చాలామంది పాటిస్తున్నారు. భారతీయ ఆయుర్వేద విధానంలోనూ ఈ చిట్కా ఎప్పటినుంచో పాతుకు పోయింది. ఇంతకీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి మిక్స్ చేసి తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. ఎందుకు తాగాలో.. అనే విషయాన్ని ఒకసారి చూద్దాం.

నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సులభం చేస్తాయి. జీర్ణ ప్రక్రియను ప్రేరేపించడానికి సహకరిస్తాయి. గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలిపినప్పుడు నెయ్యి జీర్ణవ్యవస్థకు లూబ్రికేన్సిగా వ్యవహరిస్తుంది. స్మూత్ డైజషన్ ప్రమోట్ చేసి.. డైజెస్టివ్ డిస్కంపార్టును తొలగిస్తుంది. నెయ్యి తింటే బరువు పెరిగిపోతారని కొందరు అపోహ పడుతుంటారు. అయితే అది అబద్దం. సరిపడ మోతాదులో నెయ్యిని తీసుకోవడం కూడా బరువునిర్వాహణ‌లో సహాయపడుతుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన‌ అనుభూతి కల్పించి రోజంతా ఎక్కువగా ఆహారం తినే అలవాటును తగ్గిస్తుంది.

నెయ్యి, వేడి నీటి కలయిక జీవన క్రియను కిక్ స్టార్ట్ చేయడానికి క్యాలరీలను మరింత సులభంగా భార్న్‌ చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ త్వరగా జరగడానికి భోజనం చేసే ముందు వేడి నీళ్లు తీసుకుంటాం. అయితే ఈ నీటిలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల అతి ఆకలిని నివారించవచ్చు. బరువు కూడా అదుపులోకి వస్తుంది. నేతిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల కీళ్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పోషకాలకు నెయ్యి మూలంగా పనిచేస్తుంది. ఉదయానికి గోరు వెచ్చని నీటితో నెయ్యి కలుపుకోవడం వల్ల జాయింట్ లూబ్రికేషన్ పెరుగుతుంది.

మోకాళ్ళ సమస్యలకు, కీళ్ళనొప్పుల వంటి బాధల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కొవ్వులు, విటమిన్ ఏ, డి, ఈ, కే వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మద్దతుగా నిలుస్తాయి. గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలను కూడా చెక్ పెట్టవచ్చు. నెయ్యిలో ఉండే పోషక గుణాలు చర్మానికి అందుతాయి. ఇందులోని కొవ్వులు, విటమిన్‌లు చర్మాన్ని లోపల నుంచి తేమగా చేసి ఆరోగ్యంగా ప్రకాశవంతంగా చర్మాన్ని మేలుకొలుపుతాయి.