యానిమల్ సినిమాకి త్రిష షాకింగ్ రివ్యూ.. జనాలు బూతులు తిట్టడంతో డిలీట్..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా యానిమల్ . ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా.. హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమా అభిమానులకు చాలా బాగా ఆకట్టుకునింది . కొంతమంది జనాలకు బోల్డ్ నెస్ గా కనిపించింది. మరి కొంత జనాలకు మాత్రం సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ అద్దిరిపోయే రేంజ్ లో నచ్చేసింది .

ఈ సినిమాకి పలువురు స్టార్ హీరోలు – హీరోయిన్లు – డైరెక్టర్లు సైతం రివ్యూ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ ఒకప్పటి నటి త్రిష అద్దిరిపోయే రివ్యూ ఇచ్చింది . యానిమల్ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ వన్ డైలాగ్ అంటూ “కల్ట్” అంటూ సినిమాకి సంబంధించిన బోల్డ్ సీన్స్ పై ఏమోజీ పిక్చర్స్ తో షేర్ చేసింది .

అంతే త్రిషపై బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు జనాలు. నిన్న కాక మొన్ననేగా మన్సూర్ అలీ ఖాన్ పై అలా మాట్లాడాడు అంటూ ఫైర్ అయ్యావు . మరి సినిమాలో ఇంత బూతు కంటెంట్ ఉంటే ఎలా ఎంకరేజ్ చేస్తున్నావ్ ..? అంటూ మండిపడ్డారు. దెబ్బకు దారిలోకి వచ్చిన త్రిష ఆ పోస్టర్ను డిలీట్ చేసేసింది. అయినా సరే అప్పటికే స్క్రీన్ షాట్ తీసి జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!