రాసిపెట్టుకోండి..నేను చచ్చేలోపు ఆ హీరోతో ఖ‌చ్చితంగా సినిమా తీస్తా : ప్ర‌శాంత్ నీల్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజిఎఫ్‌ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతుంది. సలార్ సీజ్‌ ఫైర్ పార్ట్ 1 డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్‌ టైం దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్ లో బిజీగా గడుతుంది.

ఈ క్ర‌మంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. తన డ్రీమ్ గురించి బయటకు చెప్పాడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తో తాను చనిపోయేలోపు ఒక్క సినిమా నైనా తీయాలని ఆయన కల అంటూ వివ‌రించాడు. అమితాబ్‌ సినిమాలను చూసి నేను చాలా తెలుసుకున్నా.. అందుకే ఆయనతో కలిసి నేను సినిమాలు చేయాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు.

అది నా డ్రీమ్.. అలాగే ఆయన విలన్ పాత్రలో మాత్రమే చేయాలి. బిగ్‌బీతో సినిమా తీసిన ఆయన మూవీలో నటించిన దానిని నేను పెద్ద గౌరవంగా భావిస్తా అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్‌. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.