సినీ పాలి “ట్రిక్స్”: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఆ ఇద్దరు తెలుగు హీరోల పాలిట శాపంగా మారబోతుందా..? రేవంత్ రెడ్డి రివేంజ్ తీర్చుకుంటాడా..?

సినిమా ఇండస్ట్రీని రాజకీయాలని ఎప్పుడూ నమ్మకూడదు . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది జరుగుతుంది అని ఆలోచించే లోపే అది జరగకుండా పక్కకి వెళ్లిపోతుంది . ఇది జరగదు అనుకున్నదే ఖచ్చితంగా సెకండ్స్ లో జరిగిపోతూ ఉంటుంది . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ కౌంటింగ్ . ఎవరు ఊహించిన విధంగా బీఆర్ఎస్ ఘోర ఓటమిపాలవ్వడం సంచలనానికి తెరలేపుతూ కాంగ్రెస్ తెలంగాణలో అఖండ విజయం సాధించడం ఇప్పటికీ అభిమానులకు మింగుడు పడడం లేదు .

అయితే కేవలం తెలంగాణలో కాంగ్రెస్ రావడం పట్ల రాజకీయ నేతలకే కాదు ఇద్దరు తెలుగు హీరోలకి కూడా అస్సలు నచ్చడం లేదు. దానికి మెయిన్ రీసన్ వాళ్లకు బిఆర్ఎస్ తో ఉన్న అనుబంధమే . బీఆర్ఎస్ కారణంగా తెలంగాణలో పలు హోటల్స్ పలు బిజినెస్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారట వీళ్ళు . అంతేకాదు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీళ్లిద్దరూ జాన్ జిగిడి దోస్తులు సినిమా ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తి చూపించిన ఈ ఇద్దరు మాత్రం అస్సలు వేలెత్తి చూపించరు .

అంత జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టిఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత అస్సలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరు తెలుగు హీరోలను ఏం కాపాడుతాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది . అంతేకాదు ఇద్దరి తెలుగు హీరోలకు ఇప్పుడు గుండెల్లో రైలు పరిగెస్తున్నాయట. రేవంత్ రెడ్డికి ఉన్న దూకుడు అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఈ ఇద్దరు హీరోలపై రివేంజ్ తీర్చుకోకుండా ఉండడు అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తూ అసలు గెలవడు అనుకున్న కాంగ్రెస్ను గెలిపించి చక్రం తిప్పావు నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు..!