” జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని.. నన్ను మూవీ నుంచి తొలగించారు “… విజయ్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్…!!

నటుడు విజయ్ వర్మ మనందరికీ సుపరిచితమే. ఈయనకి ఇతువరకూ పెద్దగా పేరు లేకపోయినప్పటికీ.. ఎప్పుడైతే తమన్నతో లవ్ ట్రాక్ బయటపడిందో అప్పటినుంచి ఈయన రేంజ్ వేరు. అప్పటికే ఎన్నో సినిమాలలో నటించినా రాణి గుర్తింపు.. కేవలం తమన్న ప్రియుడిగా మాత్రం ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఈయన మాట్లాడుతూ..” ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలీవుడ్ లో నాకు ఎన్నో మూవీ ఆఫర్స్ వచ్చాయి. కానీ అవి తొందరగానే చేజారిపోయాయి. ఓసారి ఓ పెద్ద సినిమాలో మంచి అవకాశం వచ్చింది. మేకర్స్ నావి కొన్ని ఫోటోలు పంపాలని చెబితే పంపించాను. కానీ కొద్ది రోజులకే నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. రీజన్ ఏంటని అడిగితే.. ఈ మూవీ తెరకెక్కించే దరసుకుడికు‌ ఆయన జ్యోతిష్కుడు నన్ను మూవీ నుంచి తీసేయాలని చెప్పాడట. అందుకే తీసేసారు.

దీంతో నేను ఎంతో బాధపడ్డాను. కానీ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నన్ను చాలా ఓదార్చారు. అతను ఆ రోజు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత అతను చెప్పినట్లుగానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇష్టం లేకున్నా డబ్బుల కోసం చిన్న చిన్న పాత్రలలో కూడా నటించాను ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.