బాహుబలితో పోల్చి బ్రహ్మానందంని అవమానించారు.. ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

టాలీవుడ్ నవ్వుల బ్రహ్మీ బ్రహ్మానందం గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉదయం లేచిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్‌ రూపంలోనో, కామెడీ వీడియోస్ రూపంలోనూ ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. వెయ్యకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. పద్మశ్రీ అవార్డుతో పాటు, నంది, ఫిలిమ్‌ పేర్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను దక్కించుకున్న బ్రహ్మీ అభిమానంపరంగా కోట్లాదిమంది ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఏ కమెడియన్‌కు లేని ఫ్యాన్ బేస్‌ కేవలం బ్రహ్మానందం సొంతం.

ఇక సోషల్ మీడియాలో మీమ్స్‌ కంటెంట్ మొదలైన తరువాత ఆయనను మీమ్ గార్డ్ గా కూడా పూజిస్తున్నారు. అలాంటి బ్రహ్మానందం ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తన కామెంట్స్ తో అవమానించాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు పీవీఆర్‌.. బ్రహ్మీపై ఏం కామెంట్ చేశాడు.. ఎందుకు ఫాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు.. చూద్దాం. తెలంగాణ ఎలక్షన్స్ ఫలితాలను ఉద్దేశించి పివిఆర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడం కాంగ్రెస్ విజయం సాధించడం పై ట్విట్ చేశాడు. వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకపోతే.. బాహుబలిని, బ్రహ్మానందాన్ని.. జననేతను, జోకర్ని చేస్తారు ఓటర్ మహాశయులు.. సర్వేజనా సుఖినోభవంతు అంటూ కామెంట్స్ చేశాడు.

ఆయన ఉద్దేశంలో మంచి ఏదో.. చెడు ఏదో తెలియకుండా తెలంగాణ ఓటర్లు బిఆర్‌ఎస్‌ను ఓడించారని. అయితే వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకుండా.. బాహుబలిని, బ్రహ్మానందాన్ని.. జననేతను జోకర్‌ని చేస్తారు అంటూ రాసుకు వచ్చాడు పివిఆర్‌. ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ.. దానిలోకి బ్రహ్మానందం లాంటి బ‌హుముఖ‌ప్రజ్ఞాశాలిని లాగడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. బాహుబలి.. బ్రహ్మానందం కంటే గొప్పవాడా.. బ్రహ్మానందం ఓ మహత్తర వ్యక్తి, మహానటుడు.. మీ ప్రాస కోసం ఆయనను కించపరుస్తారా.. అంటూ ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు ఉందనుకుంటున్నావా అంటూ.. బ్రహ్మానందం గారు తక్కువ వారు కాదు, ఆయన విద్వత్తు ముందు బాహుబలి కూడా దిగదుడుపే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.